మా మధ్య ఉన్నది వ్యక్తిగత సంబంధం కాదు: శ్రీముఖి, రవి
- ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం
- తమది వృత్తి పరమైన బంధమేనన్న శ్రీముఖి, రవి
- తాము మంచి స్నేహితులమని స్పష్టీకరణ
తమ మధ్య ఉన్నది వృత్తి పరమైన బంధమే తప్ప... వ్యక్తిగత బంధం కాదని శ్రీముఖి, రవి చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటామని... చేతులు పట్టుకోవడం వంటివి చేస్తుంటామని తెలిపారు. ఇలాంటివి చూసి, తమ మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు అనుకుంటుంటారని చెప్పారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని తెలిపారు. తాము ఏంటో తమ కుటుంబ సభ్యులకు కూడా తెలుసని చెప్పారు.