Gopichand: 'సీటీమార్'లో కావాల్సినంత కామెడీ!

  • గతంలో ఫ్లాప్ అయిన 'గౌతమ్ నంద'
  • మరో ప్రయత్నంగా రానున్న 'సీటీమార్'
  • గోపీచంద్ సరసన నాయికగా తమన్నా
SeetiMaar Movie

తెలుగులోని యాక్షన్ హీరోల్లో గోపీచంద్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సారి ఆయన కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 'సీటీమార్' సినిమా చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా కనిపించనుంది.

కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ - వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం నవ్విస్తుందని అంటున్నారు. సెకండాఫ్ కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గతంలో 'గౌతమ్ నంద' సినిమాతో పరాజయాన్ని చూసిన సంపత్ నంది - గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News