Richa Gangopadhyay: సోషల్‌ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నారన్న విషయంపై అప్రమత్తంగా ఉండండి: రిచా గంగోపాధ్యాయ్

  • నా పేరిట నకిలీ ఖాతాలు
  • ఆయా ఖాతాల్లోని యూజర్ల పేర్లలో ఉన్న అక్షరాలను గమనించండి
  • ప్రత్యేక క్యారెక్టర్‌లను సరిగ్గా చూసుకోండి
  • నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలను ఫాలో అవ్వకండి 
Richa Gangopadhyay Be careful who youre following on social media and weird spellings

సోషల్‌ మీడియాలో తన పేరిట ఉన్న నకిలీ ఖాతాలపై సినీ నటి రిచా గంగోపాధ్యాయ్ అసహనం వ్యక్తం చేసింది. తన పేరిట కొందరు నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారని, వాటిని అన్‌ఫాలో కావాలని తన అభిమానులకు సూచించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఒరిజినల్‌ ఐడీ ఏదనే విషయాన్ని ట్విట్టర్‌లో చెప్పింది.

'మీరు సోషల్‌ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నారన్న విషయంపై అప్రమత్తంగా ఉండండి.. ఆయా ఖాతాల్లోని యూజర్ల పేర్లలో ఉన్న అక్షరాలను, ప్రత్యేక క్యారెక్టర్‌లను సరిగ్గా చూసుకోండి. చాలా నకిలీ ప్రొఫైల్స్‌ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకున్న ఏకైక ఐడీ richalangella పేరిట మాత్రమే ఉంది. నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలను ఫాలో అవ్వకండి. ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ నా ఖాతాను వెరిఫై చేస్తుందని నేను భావిస్తున్నాను' అని తెలిపింది.

రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రిచా.. ఆ తర్వాత   రవితేజ నటించిన మిరపకాయ్, ప్రభాస్‌ మిర్చి సినిమాలతో టాలీవుడ్‌లో  ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటనకు దూరమైంది. గత ఏడాది అమెరికా యువకుడిని పెళ్లి చేసుకుంది.

More Telugu News