‘కరోనా’ రోగుల కోసం కింగ్ కోఠి ఆసుపత్రి సిద్ధం చేస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister Kcr says one more hpspital for corona patients
  • ఈ ఆసుపత్రి లో పూర్తి స్థాయి చికిత్స అందిస్తాం
  • అధునాతన సౌకర్యాలతో,  350 పడకల సామర్థ్యంతో సిద్ధం
  • హైదరాబాద్ లో మరో4ప్రత్యేక ఆసుపత్రులనూ  అందుబాటులోకి తెస్తాం
కరోనా వైరస్ బారిన పడ్డ వారికి హైదరాబాద్ లోని గాంధీ  ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. ‘కరోనా’ బాధితుల కోసం నగరంలోని మరో ప్రభుత్వ ఆసుపత్రి కూడా అందుబాటులోకి రానుంది. ఈ వైరస్ బారిన పడ్డ వారికి కింగ్ కోఠిలోని ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘కరోనా’ బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకే ఈ ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ప్రత్యేకంగా 350 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశామని చెప్పారు. ‘కరోనా’ రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ లో మరో నాలుగు ప్రత్యేక ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
KTR
TRS
Telangana
Corona Virus
King koti Hospital

More Telugu News