Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • 'తుపాకి' సీక్వెల్ లో కూడా కాజల్ 
  • అనిల్ రావిపూడితో బాలకృష్ణ 
  • రాజమౌళి సినిమాలో మోహన్ లాల్
Kaja lin Tupaki sequel

 *  విజయ్, కాజల్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'తుపాకి' చిత్రం విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో విజయ్ తోనే ఈ చిత్రం సీక్వెల్ ను మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కూడా కథానాయికగా కాజల్ నటిస్తుందట.
*  'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు అనిల్ ను పిలిచి, తనకోసం ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని రూపొందించాల్సిందిగా బాలకృష్ణ అడిగినట్టు తెలుస్తోంది. సో.. వీరి కాంబోలో త్వరలో ఓ ఎంటర్ టైనర్ రావచ్చన్న మాట.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఓ కీలక పాత్ర  కోసం మలయాళ నటుడు మోహన్ లాల్ ను ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దర్శకుడు మోహన్ లాల్ కు ఆ పాత్ర గురించి వివరించాడనీ, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు.

More Telugu News