తెలుగు సినిమాలు చేయనని ఎవరితోనూ చెప్పలేదు: హీరోయిన్ త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు సినిమాలు చేయనని ఎవరితోనూ చెప్పలేదు: హీరోయిన్ త్రిష

Trisha
  • తెలుగు సినిమానే నన్ను నిలబెట్టింది
  • పుకార్లను నమ్మకండి  
  • మలయాళ సినిమాలతో బిజీగా వున్నానన్న త్రిష  
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆమె తన హవాను కొనసాగించింది. ఆ తరువాత కొత్త కథానాయికల పోటీ ఎక్కువ కావడంతో, ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తెలుగులో పూర్తిగా కనుమరుగైన ఆమె, తమిళ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో త్రిష తెలుగు సినిమాలు చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ .. "నేను హీరోయిన్ గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో. అలాంటప్పుడు తెలుగు సినిమాలు చేయనని ఎందుకంటాను? ఆ మధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. దాంతో తెలుగులోనే చేయదట అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పడమే నా ఉద్దేశం. ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగానే వున్నాను" అని ఆమె చెప్పుకొచ్చింది.
Trisha
Actress
Tollywood

More Telugu News