Telangana: హోం క్వారంటైన్ పాటించని నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Mahabubabad police files cases on four for not obey home quarantine
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో హోం క్వారంటైన్  పాటించని నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఇద్దరు దంపతులు ఖతర్ నుంచి జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఉన్న అత్తగారింటికి వచ్చారు.

విషయం తెలిసిన వైద్యాధికారులు దంపతులతోపాటు వారి అత్తమామలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. అయితే, అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. విషయం తెలిసిన తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో దంపతులతోపాటు అత్తమామలపై కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Telangana
Mahabubabad District
Home quarantine
Corona Virus

More Telugu News