Nagarjuna: ముఖ్యంగా వారు ఇళ్లు వదిలి బయటకు రావద్దు: హీరో నాగార్జున

nagarjuna on corona virus
షార్ట్స్‌లో చూడండి
'మీరు క్షేమంగా ఉండండి.. మీ కుటుంబాన్ని, సమాజాన్ని క్షేమంగా ఉంచండి' అంటూ ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సినీనటుడు నాగార్జునతో ఓ సందేశం ఇప్పించింది.

'ప్రియమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా విన్నపం. మీరెవ్వరూ ఇళ్లు వదిలి బయటకు రాకండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రండి. ఈ దృఢ సంకల్పంతోనే కరోనాను అరికట్టవచ్చు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు ఇళ్లు వదిలి బయటకు రాకండి.. సురక్షితంగా ఉండండి' అని నాగార్జున అందులో కోరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడదామని నాగార్జున తన ట్విట్టర్‌ ఖాతాలోనూ పేర్కొన్నారు. 
Go Back to Shorts
Nagarjuna
Tollywood
Janata Curfew

More Telugu News