Prabhas: 'సాహో'లో సాంగ్ మిస్ అయిన అనుష్క!

  • వరుస సినిమాలు చేసిన ప్రభాస్ - అనుష్క 
  • భారీ విజయాల కారణంగా ఏర్పడిన క్రేజ్ 
  • అందుకే స్పెషల్ సాంగ్ సెట్ కాలేదట
Saho Movie

ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా ఈ మధ్య 'సాహో' సినిమా ప్రేక్షకులను పలకరించింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. కథాకథనాల పరంగానే కాదు, సంగీతం పరంగా కూడా ఈ సినిమాకి చాలా తక్కువ మార్కులు దక్కాయి. ఈ సినిమాలో అనుష్క - ప్రభాస్ పై ఒక పాటను పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారట.

ఎందుకంటే 'బిల్లా' ..  'మిర్చి' .. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో ఈ జంటకి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం లభించింది. అందువలన ఈ జోడీపై ఒక సాంగ్ ను పెడితే అది సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావించారట. అందుకు అనుష్క కూడా అంగీకరించిందట. అయితే ఆ సాంగును చిత్రీకరించాలని అనుకున్నప్పుడు, 'నిశ్శబ్దం' సినిమాకి సంబంధించి తన డేట్స్ ను సర్దుబాటు చేయడం కుదరలేదట. అందువల్లనే ప్రభాస్ తో అనుష్క ప్రత్యేక గీతం కుదరలేదనే వార్త తాజాగా బయటికి వచ్చింది.

More Telugu News