Vijay: విజయ్ తో మురుగదాస్ నాలుగో సినిమా?

  • దర్శకుడిగా మురుగదాస్ కి క్రేజ్ 
  • 'దర్బార్'కి దక్కని భారీ విజయం
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి
Muruga Doss Movie

విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో గతంలో 'కత్తి' .. 'తుపాకి' .. 'సర్కార్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం.

ఇటీవల మురుగదాస్ ఒక కథను విజయ్ కి వినిపించడం .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇంతకుముందు మురుగదాస్ తెరకెక్కించిన 'దర్బార్' సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో మురుగదాస్ మార్క్ మిస్సయిందనే విమర్శలు వచ్చాయి. అయినా మురుగదాస్ ట్రీట్మెంట్ పై గల నమ్మకంతో, ఆయనకి విజయ్ ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News