మెగాస్టార్ సరసన అందాల అనుష్క?

Acharya Movie
  • షూటింగు దశలో కొరటాల మూవీ 
  • కథానాయికల విషయంలో రాని స్పష్టత 
  • అనుష్కతో సంప్రదింపులు  
చిరంజీవి .. కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపొందుతోంది. చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను ఈ కథలో కొరటాల పొందుపరిచాడు. ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష'ను తీసుకున్నారు. 'స్టాలిన్' తరువాత ఈ జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిని చూపారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకోవడంతో కాజల్ పేరు వినిపించింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో అలరించిన ఈ జోడి పట్ల కూడా అభిమానులు ఉత్సాహాన్ని కనబరిచారు.

తాజాగా ఇప్పుడు అనుష్క పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి జోడీగా .. పాత్ర పరంగా అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి, ఆమెను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఆఫర్ ను అనుష్క వదులుకోకపోవచ్చని చెబుతున్నారు. గతంలో 'స్టాలిన్' సినిమాలో చిరూ సరసన అనుష్క ఒక ప్రత్యేక గీతంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chiranjeevi
Anushka
Koratala Siva
Acharya Movie

More Telugu News