థియేటర్ల మూసివేతపై చర్చించిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
- సినిమా రంగంపై కరోనా ప్రభావం
- ఇప్పటికే వాయిదా పడిన పలు సినిమాలు
- ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని వెల్లడి
ఇక తాజాగా సమావేశమైన టాలీవుడ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించిన మండలి, విడుదల కావాల్సిన అన్ని సినిమాలనూ రెండు వారాల పాటు వాయిదా వేస్తామని వెల్లడించారు.