మరోసారి సాయితేజ్ తో జోడీ కడుతున్న రాశి ఖన్నా
- దేవ కట్టాతో సాయితేజ్ మూవీ
- కథానాయికగా నివేద పేతురేజ్
- సాయితేజ్ తో మూడోసారి రాశి ఖన్నా
ఈ సినిమాలో ఒక కథానాయికగా నివేద పేతురేజ్ ను తీసుకున్నారు. మరో ప్రత్యేకమైన పాత్ర కోసం రాశి ఖన్నాను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. రాశి ఖన్నాతో ఒక పాట .. కొన్ని సీన్లు వుంటాయని చెబుతున్నారు. ఇంతకుముందు సాయితేజ్ - రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'సుప్రీమ్'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఆ సెంటిమెంట్ తోనే మళ్లీ రాశి ఖన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.