నేను టీడీపీని వీడుతున్నానన్న వదంతులు అబద్ధం: శిద్ధా రాఘవరావు

siddha Raghava Rao says do not believe rumours about me
ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. ఈ వదంతులను ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కాగా, శిద్ధా రాఘవరావు ప్రస్తుతం దర్శి టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాఘవరావుకు చెందిన గ్రానైట్ కంపెనీలో ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్టు ఆయనపై వదంతులు వ్యాపించాయి.
Go Back to Shorts
Siddha Raghavarao
Telugudesam
Prakasam District

More Telugu News