Nita Ambani: అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో నీతా అంబానీకి స్థానం

  • స్పోర్ట్స్ బిజినెస్ నెట్ వర్క్, ఐ స్పోర్ట్స్ కనెక్ట్ సంయుక్త జాబితా
  • టాప్ 10లో ఉన్న నీతా అంబానీ
  • ముంబయి ఇండియన్స్ విజయప్రస్థానంలో నీతా పాత్రకు గుర్తింపు
Nita Ambani gets a place in most influential woman in sports

ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయంలో ముంబయి ఇండియన్స్ ఆడుతుంటే స్టేడియంలో నీతా అంబానీ కచ్చితంగా ఉండాల్సిందే. తమ జట్టు గెలిచినా, ఓడినా ఆటగాళ్లను మాత్రం ఒకేవిధంగా గౌరవిస్తారని నీతా గురించి ప్రచారంలో ఉంది. ఒకవిధంగా ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరుపొందడానికి నీతా అంబానీ వ్యవహార దక్షత కూడా ఓ కారణమని చెప్పాలి.

ఫుట్ బాల్ లీగ్ లోనూ ఫ్రాంచైజీతో సత్తా చాటుతున్నారు. ఇప్పుడామె కార్యదీక్షకు గుర్తింపుగా అరుదైన గౌరవం లభించింది. క్రీడల్లో అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో నీతాకు పట్టం కట్టారు. ఐ స్పోర్ట్స్ కనెక్ట్, స్పోర్ట్స్ బిజినెస్ నెట్ వర్క్ సంయుక్తంగా విడుదల చేసిన ఈ జాబితా టాప్ 10 లో నీతా కూడా ఉంది. ఈ జాబితాలో టెన్నిస్ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్, నవోమీ ఒసాకా, స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తదితరులు ఉన్నారు.

More Telugu News