sameera reddy: అత్తతో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌ చేసిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌

  • ‘ఫ్లిప్‌ ద స్విచ్‌’ ఛాలెంజ్‌లో పాల్గొన్న సమీర
  • క్వావో పాటకు డ్యాన్స్‌
  • కోడలిని మించి డ్యాన్స్‌ చేసిన అత్త
sameera reddy dance

తన అత్తతో హీరోయిన్‌ సమీరా రెడ్డి డ్యాన్స్‌ చేస్తూ వీడియో తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ‘ఫ్లిప్‌ ద స్విచ్‌’ ఛాలెంజ్‌లో ఆమె పాల్గొంది.  ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఓ వ్యక్తి  కెమెరాను పట్టుకుని అద్దం ముందు నిలబడి ఉండాలి.

అదే సమయంలో మరొకరు ఏదైనా పాటకు డ్యాన్స్‌ చేయాలి. ఆ తర్వాత డ్యాన్స్ చేసిన వ్యక్తి కెమెరాను పట్టుకుంటారు. అప్పుడు అప్పటివరకు కెమెరాను పట్టుకున్న వ్యక్తి డ్యాన్స్ చేయాలి. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న సమీరా క్వావో పాటకు తన అత్తతో కలిసి తీసుకున్న వీడియో అందరినీ అలరిస్తోంది.

ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయడానికి ఆమె ప్రత్యేకంగా అత్తను ఎంచుకున్నందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కోడలిని మించి ఆమె డ్యాన్స్‌ చేసిందని అంటున్నారు. సమీర అత్త హుషారుగా డ్యాన్స్‌ చేయడం అభిమానులను ఆకర్షిస్తోంది. అత్తగారు మీ శక్తిని దొంగిలించినప్పుడు ఆమె ఓ అద్భుతమని, ఆమె తనలాగే క్రేజీగా ఉందని తెలిపింది.

More Telugu News