పక్కా స్కెచ్ గీశారు.. బుద్ధా వెంకన్నను, నన్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు: బోండా ఉమ
- నిన్న రాత్రి వరకు మాచర్లకు వెళతామని మాకు తెలియదు
- మాచర్లలో మా అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు
- దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళ్లాం
ఈరోజు పక్కాగా స్కెచ్ గీసి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను, తనను నడిరోడ్డుపై హత్య చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు మాచర్లకు వెళతామన్న విషయం తమకు తెలియదని అన్నారు. మాచర్లలో నిన్న సాయంత్రం జరిగిన పరిణామాల విషయమై మాట్లాడేందుకు తమ అడ్వకేట్లను తీసుకుని వెళ్లామని చెప్పారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, భద్రత కల్పించాలని చెప్పేందుకు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకే తాము వెళ్లామని చెప్పారు.