వైసీపీకి ప్రచారం చేసే గ్రామ వాలంటీర్లకు దేహశుద్ధి చేయండి: బుద్ధా వెంకన్న
- ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలి
- అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలన్న వెంకన్న
- వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు కలసికట్టుగా పని చేయాలన్న అశోక్ బాబు
మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, టీడీపీని ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి టీడీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా, గన్నే అన్న, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు, లింగమనేని శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు.