Venkat: హీరోగా నేను వెనకబడిపోవడానికి అదో కారణం: హీరో వెంకట్

 Hero Venkat about his career up down
షార్ట్స్‌లో చూడండి
'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వెంకట్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ఆయనను చూసిన ప్రేక్షకులు, హీరోగా బాగా బిజీ అవుతాడని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ఒక సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను. సహజత్వం కోసం నేను డూప్ లేకుండా పై నుంచి జంప్ చేశాను. అక్కడి నుంచి పడిపోవడం వలన నా వెన్నెముకకు గాయమైంది. షూటింగుకి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ విషయాన్ని బయటికి రానీయలేదు. ఆ గాయం కారణంగా నేను 3 నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. ఆ గాయం బాధ పెడుతుండటం వలన నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇక పారితోషికం మరీ తక్కువగా ఇస్తామని చెప్పడం వలన కూడా కొన్ని అవకాశాలను వదులుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Venkat
Roshan
Tollywood

More Telugu News