మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండ బాక్సింగ్?
- ఫైటర్ మూవీలో దిగ్గజ బాక్సర్ ప్రత్యేక పాత్ర?
- పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా
- విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే
బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే, అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషింబోతున్నాడట. విలన్ పాత్రలో టైసన్ నటిస్తాడని, అతనితో విజయ్ ఫైటింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.