KCR: ఈ రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం

  • వార్షిక బడ్జెట్ కు ఆమోదం ...
  • అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహరచన ...
  • ఇతర అంశాలపై చర్చించే అవకాశం
Telangana cabinet meets today evening

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఉభయసభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగించడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైనా మంత్రి మండలి చర్చిస్తుంది.

More Telugu News