ప్రభాస్ హీరోగా కొరటాల మూవీ .. నిర్మాణ సంస్థగా మైత్రీ
- చిరూ సినిమాతో బిజీగా కొరటాల
- తదుపరి సినిమా చరణ్ తో
- 'మిర్చి' కాంబినేషన్ మళ్లీ సిద్ధం
ఈ ప్రాజెక్టు తరువాత ప్రభాస్ తో కొరటాల సినిమా వుండనుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కొరటాల - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే కొరటాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ కావడం, ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. నాగ్ అశ్విన్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లేది కొరటాలతోనే.