విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్: హీరోయిన్ అనన్య పాండే
- ముంబైలో జరుగుతున్న 'ఫైటర్' షూటింగ్
- కథానాయికగా అనన్య పాండే పరిచయం
- విజయ్ దేవరకొండ మంచి ఆర్టిస్ట్ అంటున్న అనన్య
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్ అండ్ కైండ్. అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడతాడు. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ సందడి చేస్తుంటాడు. కొత్తవారితో సంభాషణను కొనసాగించడం ఆయనకి బాగా తెలుసు. విజయ్ దేవరకొండ మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. ఆయనతో ఈ సినిమా చేస్తున్నందు వలన ప్రత్యక్షంగా చూస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య ఈ సినిమా ద్వారానే పరిచయమవుతోంది.