త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత?
- ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా
- ఇద్దరు కథానాయికలకు అవకాశం
- త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు హిట్లు కొట్టిన సమంత
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పేరు .. రష్మిక మందన పేర్లు వినిపించాయి. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన ఒక నాయికగా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఆ పాత్రకి సమంత అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను .. అటు ఎన్టీఆర్ కాంబినేషన్లోను నటించిన అనుభవం సమంతకి వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో ఆమె చేసిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక మరో కథానాయికగా రష్మిక పేరు మాత్రం వినిపిస్తూనే వుంది.