'నారప్ప' షూటింగుకి రెండవ హీరోయిన్
- షూటింగు దశలో 'నారప్ప'
- కథానాయికగా 'రెబా మోనికా జాన్' పరిచయం
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
మలయాళంలో 'రెబా మోనికా జాన్' కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. వెంకటేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించనున్నారు. చక్కని కనుముక్కుతీరు .. ఆకర్షణీయమైన రూపం రెబా సొంతం. 'నారప్ప' విజయవంతమైతే ఈ సుందరి ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగానే వున్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.