Suma: యాంకర్ సుమ హావభావాలకు షాక్ అవుతోన్న నెటిజన్లు.. వీడియో వైరల్

Anchor Suma Expressions To Neeli Neeli Aakasam Song by Sunitha
'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా' అనే పాటకు మంచి స్పందన వస్తోంది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా కోసం చంద్రబోస్ రాసిన ఈ సాహిత్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ పాటకు యాంకర్‌ సుమ ఇచ్చిన హావభావాలకు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆమెలో గొప్ప నటి కూడా ఉందని ఇప్పుడే తెలిసిందని కామెంట్లు చేస్తున్నారు.
  'నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ ఓ ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ అ ఆ అ ఆ.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే' అంటూ గాయని సునీత పాడుతుండగా సుమ ఈ హావభావాలు ఇచ్చింది. తాను పాడుతున్న పాటకు సుమ హావభావాలు ప్రదర్శిస్తున్న సమయంలో సునీత ఈ వీడియో తీసింది. ప్రస్తుతం 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట అందరి స్మార్ట్‌ఫోన్లలోనూ వినిపిస్తుంది. బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా రూపుదిద్దుకుంది.
Suma
Tollywood

More Telugu News