ఆసక్తిని రేకెత్తిస్తున్న 'హిట్' ట్రైలర్
- మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో విష్వక్సేన్
- ఈ నెల 28వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమాను నాని సమర్పిస్తున్నాడు. రుహని శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ట్రైలర్ తో మరింతగా ఆసక్తి పెరిగేలా చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.