KCR: పాత మిత్రుడిని చూసి కేసీఆర్ పరవశం... ఆత్మీయ ఆలింగనం!

KCR Gets emotional after seeing old friend
షార్ట్స్‌లో చూడండి
సంపత్ కుమార్... ఎన్నడో కేసీఆర్ కు మంచి స్నేహితుడు. కేసీఆర్ సీఎం అయిన తరువాత ఆయన్ను కలిసింది చాలా తక్కువ. నిన్న కరీంనగర్ శివారు ప్రాంతంలో ఉన్న తీగల గుట్టపల్లెలో కేసీఆర్ బస చేసిన వేళ, సంపత్ కుమార్, ఆయన్ను కలిసేందుకు రాగా, వెంటనే లేచి వెళ్లి, ఆలింగనం చేసుకుని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

చాలా రోజుల తరువాత స్నేహితుడిని చూసిన ఆనందం కేసీఆర్ మోములో కనిపించింది. ఈనెల 15న తన సోదరుడి కుమారుడి వివాహం ఉందని, ఆ కార్యక్రమానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని సీఎంకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ను అందించిన సంపత్ కుమార్, తమకున్న స్నేహ బంధాన్ని మీడియాకు తెలిపారు.

హైదరాబాద్, కాచిగూడలోని నింబోలి అడ్డాలో, తాను, కేసీఆర్ ఒకే గదిలో ఉండే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తామిద్దరమూ ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిసి చేశామని అన్నారు. అప్పటి నుంచి కేసీఆర్ మారలేదని, ఇప్పటికీ తమ స్నేహం కొనసాగుతూనే ఉందని అన్నారు.
Go Back to Shorts
KCR
Friend
Sampat Kumar

More Telugu News