vijay: హీరో విజయ్‌కు ఆదాయ పన్ను శాఖ సమన్లు

షార్ట్స్‌లో చూడండి
చెన్నైలో సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్టార్‌ హీరో విజయ్‌ ఇంటిపై ఐటీ దాడులు మరింత హీట్‌ను పెంచాయి. కక్షతోనే బీజేపీ ఆదాయపన్ను శాఖతో దాడులు చేయిస్తోందని విమర్శలు వచ్చాయి. కాగా, ఐటీ అధికారులు ఈ రోజు మరో అడుగు ముందుకేశారు.

పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఆయనకు సమన్లు జారీ చేశారు. అలాగే ప్రముఖ నిర్మాత అన్బు చెజియన్‌ తో వున్న ఆర్ధిక సంబంధాలపైనా వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కాగా, హీరో విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రంలో పలు అంశాలు బీజేపీని టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించకపోవడం, జీఎస్‌టీ వసూళ్లు వంటి సన్నివేశాలు బీజేపీ నేతలను ఆగ్రహానికి గురి చేశాయి.
Go Back to Shorts
vijay
Tamilnadu
IT Raids

More Telugu News