నక్సలైట్ గా కనిపించనున్న చరణ్?
- షూటింగు దశలో కొరటాల సినిమా
- ప్రత్యేక పాత్రలో కనిపించనున్న చరణ్
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చరణ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరంజీవి పాత్ర యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ పాత్ర ఏమిటా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ఆయన ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది.