అఖిల్ సినిమాలో రెండవ కథానాయికగా ఈషా రెబ్బా

  • షూటింగు దశలో అఖిల్ సినిమా 
  • లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ 
  • మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూజా హెగ్డే .. ఈషా రెబ్బా
మొదటి నుంచి కూడా అఖిల్ తన సినిమాల విషయంలో గ్యాప్ ఎక్కువ ఇస్తూ వస్తున్నాడు. అయినా సక్సెస్ అనేది ఆయనతో దోబూచులాడుతూనే వుంది. తన 4వ సినిమాను ఆయన 'బొమ్మరిల్లు' భాస్కర్ తో చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. రెండవ కథానాయికగా ఈషా రెబ్బా నటిస్తుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈషా రెబ్బాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బాకి, ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందనే టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే - ఈషా రెబ్బా ఇద్దరూ కూడా ఇంతకుముందు 'అరవింద సమేత'లో కలిసి నటించారు. మరోసారి ఈ ఇద్దరూ కలిస్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.
Go Back to Shorts
Akhil
Pooja Hegde
Eesha rebba
Bommarillu Bhaskar

More Telugu News