పాండిచ్చేరిలో 'పొన్నియిన్ సెల్వన్'
- చారిత్రక నేపథ్యంతో 'పొన్నియిన్ సెల్వన్'
- భారీ తారాగణంతో కొనసాగుతున్న చిత్రీకరణ
- అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
ఇటీవలే థాయ్ లాండ్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసిన ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను పాండిచ్చేరిలో ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది. వారం .. పది రోజులపాటు అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ .. కార్తీ .. జయం రవి కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఒక చారిత్రక దృశ్యకావ్యంగా నిలిచిపోతుందనే మణిరత్నం నమ్మకం, అందరిలోను ఆసక్తిని పెంచుతోంది.