'జాను' ప్రీ రిలీజ్ వేడుకకి వేదిక ఖరారు
- తమిళ .. కన్నడ భాషల్లో ఆకట్టుకున్న కథ
- 'జాను'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు
- కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్
రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైజాగ్ - ఎ.యు. సిరిపురంలోని 'సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్' ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. అటు సమంత .. ఇటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో వున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తమిళ .. కన్నడ భాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.