యాక్షన్ తో రఫ్ ఆడించేస్తున్న చిరూ
- వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం
- 20 కోట్ల రూపాయలతో భారీ సెట్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
తనపై విరుచుకుపడిన విలన్ గ్యాంగ్ ను చిరంజీవి తనదైన స్టైల్లో రఫ్ ఆడించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దేవాలయ భూముల ఆక్రమణ .. ఆ వైపు నుంచి జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలతో ఈ కథను తయారు చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా త్రిష మెరవనుందని చెబుతున్నారు.