నారావారిపల్లెలో వైసీపీ సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారు: అమర్ నాథ్ రెడ్డి
- నాగార్జున వర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్ ను తప్పుబట్టిన మాజీ మంత్రి
- వర్సిటీ వీసీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించాడని ఆరోపణ
- ఎస్వీ వర్సిటీ విద్యార్థులను కూడా సస్పెండ్ చేస్తారా? అని నిలదీత
నారావారిపల్లెలో జరిగిన వైసీపీ సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారని, మరి ఆ విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. ఏపీలో రెండు రకాల చట్టాలున్నాయా అనే విషయం ప్రభుత్వం చెప్పాలని అన్నారు. నాగార్జున వర్సిటీ విద్యార్థులకో న్యాయం, ఎస్వీ వర్సిటీ విద్యార్థులకో న్యాయమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.