గోపీచంద్ కి అక్క పాత్రలో భూమిక
- సంపత్ నంది నుంచి 'సీటీమార్'
- కబడ్డీ కోచ్ పాత్రలో గోపీచంద్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
అలా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'.. ' సవ్యసాచి' వంటి సినిమాల్లో నటించిన భూమిక, తాజాగా మరో సినిమాలో అక్క పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో అక్క పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో, భూమికను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.