నా ఆరోగ్యం ఇప్పుడు భేషుగ్గా ఉంది: హాస్య నటుడు సునీల్

  • ఇటీవల ఆసుపత్రిలో చేరిన సునీల్
  • ఆరోగ్యం మెరుగుపడిందని వెల్లడి
  • ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెప్పిన సునీల్
తొలుత కమేడియన్ గా, ఆపై హీరోగా తనేంటో నిరూపించుకున్న సునీల్, ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, "నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ 'డిస్కో రాజా' చూసి ఆనందించండి" అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Sunil
Twitter
Health
Disco Raja

More Telugu News