galla jaydev: ఎంపీ గల్లా జయదేవ్ అరెస్టు.. పోలీసులు లాగడంతో చినిగిన చొక్కా

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తుది నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను లాగడంతో ఆయన చొక్కా చిరిగిపోయింది. దీంతో పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు.

ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ సెక్షన్‌ను అమరావతిలో అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మహిళలను విచక్షణారహితంగా పోలీసులు కొడుతున్నారని ఆయన అన్నారు. పోలీసులు తమ పోరాటాన్ని ఆపలేరని గల్లా జయదేవ్ అన్నారు.

Go Back to Shorts
galla jaydev
Telugudesam
Andhra Pradesh

More Telugu News