ముట్టడిస్తాం, దాడులు చేస్తామంటే నేరం కిందకు వస్తుంది: తమ్మినేని సీతారాం
- ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుందన్న తమ్మినేని
- భావస్వేచ్ఛ హరించే హక్కు ఎవరికీ లేదని వెల్లడి
- ముట్టడులు, దాడులు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు
సభ్యులు కానివారు చట్టసభల్లోకి రాకుండా నిరోధించే అధికారం ఉందని, సభ్యులు కానివారు ప్రవేశిస్తే శిక్షించే అధికారం ఉందని వెల్లడించారు. సభ్యులు తమ అభిప్రాయాలను సభలో చెప్పవచ్చని వివరించారు. దాడులు చేస్తామనడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం అని పునరుద్ఘాటించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తమ్మినేని తెలిపారు.