Amaravati: మహిళలపై దాడి చేశారు: జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తెచ్చిన గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ

షార్ట్స్‌లో చూడండి
గుంటూరులో ఈ రోజు జాతీయ మహిళా కమిషన్‌ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కమిషన్‌ సభ్యులను పలువురు టీడీపీ నేతలు కలిసి.. అమరావతిలో మహిళలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహిళా కమిషన్‌ సభ్యులను టీడీపీ నేతలు గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ కలిశారు.

రాజధానిలో మహిళలపై జరిగిన దాడి గురించి కమిషన్‌ సభ్యుల దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు.. కమిషన్‌ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్‌లకు వినతి పత్రం అందజేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో పలువురు మహిళలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Telugudesam

More Telugu News