తెలుగు స్టార్ హీరోలపై శ్రుతి హాసన్ మనసులో మాట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు స్టార్ హీరోలపై శ్రుతి హాసన్ మనసులో మాట

  • మహేశ్ బాబు హ్యాండ్సమ్ 
  • బన్నీలో అంకితభావం ఎక్కువ 
  • పవన్ చాలా స్టైలీష్ అని చెప్పిన శ్రుతి
తెలుగులో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి ఎంతో క్రేజ్ వుంది. ఆమె నాజూకుదనానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక్కడి ప్రేక్షకులు ఆమెకి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ను ముట్టజెప్పారు. అయితే ఆ తరువాత ఆమె బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టడం వలన, తెలుగు సినిమాలతో గ్యాప్ వచ్చింది.

ఈ మధ్యనే ఆమె మళ్లీ దక్షిణాది సినిమాల వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "తెలుగులో నాకు మంచి హిట్స్ పడ్డాయి. ఆ జాబితాలో 'శ్రీమంతుడు' .. 'రేసుగుర్రం' .. 'బలుపు' వంటి చిత్రాలు ఉన్నప్పటికీ, 'గబ్బర్ సింగ్' స్థానం ప్రత్యేకం. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు హ్యాండ్సమ్ .. పవన్ కల్యాణ్ స్టైలీష్ పర్సన్ .. బన్నీకి అంకితభావం ఎక్కువ .. ఆకర్షణీయమైన హైట్ ప్రభాస్ సొంతం అని చెప్పుకొచ్చింది.
Sruthi Hassan
Pavan
Mahesh Babu
Allu Arjun

More Telugu News