అప్పట్లో మార్షల్... ఇప్పుడు షమీ: గవాస్కర్ వ్యాఖ్యలు
- టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న షమీ
- షమీపై గవాస్కర్ ప్రశంసలు
- ఆకలిగొన్న చిరుత అంటూ వ్యాఖ్యలు
- నాటి విండీస్ దిగ్గజం మార్షల్ తో పోలిక
గతంలో వెస్టిండీస్ లెజెండ్ మాల్కమ్ మార్షల్ ఇదే తరహాలో బౌలింగ్ చేసేవాడని, అతడి బౌలింగ్ ధాటికి నిద్రలో కూడా ఉలిక్కిపడేంతగా భయపడేవాళ్లని గవాస్కర్ వివరించారు. ఇప్పుడు షమీ బౌలింగ్ కూడా నాటి మార్షల్ బౌలింగ్ ను జ్ఞప్తికి తెస్తోందని, షమీని చూస్తుంటే ఆకలిగొన్న చిరుతపులి వేటకు బయల్దేరినట్టుగా ఉందని కితాబిచ్చారు.