Nampally: నాంపల్లి స్టేషన్ వద్ద సులభ్ కాంప్లెక్స్ లో తుపాకుల కలకలం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాటు తుపాకులు లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఇక్కడి సులభ్ కాంప్లెక్సులో రెండు నాటు తుపాకులు కనిపించడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ కు వచ్చిన ఎవరైనా సులభ్ కాంప్లెక్సులో తుపాకులను దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Nampally
Hyderabad
Telangana
Guns
Police

More Telugu News