బాబు అనుభవం దోచుకోవడానికి ఉపయోగపడింది.. జగన్ కు ఏమో ఆత్రం ఎక్కువ: కన్నా
- రాజధాని మార్చాలనుకోవడం కక్ష సాధింపులా ఉంది
- పరిపాలనా వికేంద్రీకరణ కరెక్టు కాదు
- జగన్ కు అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యం
రాష్ట్ర విభజనతో నష్టపోయిన తమ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ పైసా ముఖ్యమేనని సూచించారు. ప్రతి పైసాను అభివృద్ధికి వినియోగిస్తారన్న నమ్మకంతో గతంలో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు కానీ, ఆయనకు ఉన్న అనుభవం అంతా దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జగన్ కు ఏమో అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యం ఈ రెండూ ఉన్నాయని, దీనికితో ‘ఆత్రం’ కూడా చాలా ఎక్కువగా ఉందని, వీటితో రాష్ట్రానికి చాలా ప్రమాదమని అన్నారు.