మూడు కాకపోతే 33 పెట్టుకుంటాం.. రాజధానులపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
- రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం
- రాజధానుల నిర్మాణానికి కేంద్రం అనుమతి అక్కర్లేదు
- మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు
రాజధానుల నిర్మాణానికి కేంద్ర అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి తెలిపారు. తెలంగాణ తరహాలో ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు. విశాఖలో భూములు కొన్నామని చెప్పడం అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. అక్కడ ఇప్పటికే భూముల ధరలు పెరిగినట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో నిర్వహిస్తామని పెద్దిరెడ్డి వెల్లడించారు.