నా భార్య అనుష్కకు నేనిచ్చే అరుదైన బహుమతి ఇది: విరాట్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భార్య అనుష్కకు నేనిచ్చే అరుదైన బహుమతి ఇది: విరాట్ కోహ్లీ

  • నిన్న టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై  భారత్ ఘనవిజయం
  • డిసెంబరు 11న విరుష్క రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ 
  • ఈ ఇన్నింగ్స్‌ తనకు ప్రత్యేకమన్న కోహ్లీ
ముంబయిలో వెస్టిండీస్ తో నిన్న జరిగిన  టీ20 మ్యాచ్ లో భారత్ 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ఇది తనకు చాలా ప్రత్యేక ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. డిసెంబరు 11న రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ జరుపుకుంటున్నామని, ఈ ఇన్నింగ్స్‌ తన భార్య అనుష్కకు తానిచ్చే అరుదైన బహుమతని వ్యాఖ్యానించాడు.

విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ తార అనుష్క శర్మకు  2017, డిసెంబర్‌ 11న వివాహం జరిగింది. నిన్న మ్యాచ్ ముగిశాక వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తో మాట్లాడుతూ తన వెడ్డింగ్‌ యానివర్సరీ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. నిన్న జరిగిన నిర్ణయాత్మక టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో హోరెత్తించి 70 పరుగులు బాదాడు.
Anushka Sharma
Virat Kohli
Cricket

More Telugu News