గాంధీ ఆసుపత్రికి చేరిన దిశ కేసు నిందితుల మృతదేహాలు
- సోమవారం రాత్రి గాంధీకి చేరిన మృతదేహాలు
- శుక్రవారం వరకూ ఇక్కడే
- గురువారం మరోసారి కేసు విచారణ
హైకోర్టు ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ ఆసుప్రతి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లలో తగిన బందోబస్త్ మధ్య సోమవారం రాత్రి మృత దేహాలను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వరకూ మృతదేహాలను భద్రపరచాల్సి ఉన్నందున అవి పాడవకుండా తగిన ఏర్పాట్లు చేశారు గాంధీ వైద్యులు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిందితుల డెడ్ బాడీలను ఉంచిన ప్రాంతంలో తగిన భద్రతను కల్పించారు.