ఎన్టీఆర్ వ్యవహారంలో నేను కూడా ఉన్నా.. పశ్చాత్తాపపడుతున్నా!: స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
- ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయానికి విచారిస్తున్నా
- విచక్షణాధికారంతోనే వల్లభనేని వంశీకి అవకాశమిచ్చా
- అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు
స్పీకర్ గా తనకున్న విచక్షణాధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు వల్లభనేని వంశీకి అవకాశమిచ్చానని తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి ఓ సభ్యుడితో మాట్లాడించారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని తెలిపారు.