అభివృద్ధి చేతకాకపోతే చెప్పండి... మేం చేసి చూపిస్తాం: వైసీపీ ప్రభుత్వంపై కేశినేని నాని ధ్వజం
- విధ్వంసాల ప్రభుత్వం అంటూ మండిపాటు
- సొంత పనుల కోసం ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తున్నారని ఆరోపణ
- అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? అంటూ విమర్శలు
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరైన కేశినేని నాని ఇటీవల జరిగిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్య విషయాన్ని లోక్ సభలో లేవనెత్తారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బదులిస్తూ, ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు షురూ చేసిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంతేకాకుండా, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టు సంక్షేమ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.