ఉల్లిని కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి: చంద్రబాబు
- ఏపీలో నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి
- వైసీపీ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైంది
- రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని.. అటకెక్కించారా?
రాష్ట్రంలో ధరల పెరుగుదల ఒక్క ఉల్లికే పరిమితం కాలేదంటూ.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయని పేర్కొన్నారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారంటూ.. అది ఏమైందని ప్రశ్నించారు. ఉల్లిని కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయన్నారు. ఉల్లి ధరల తడాఖా ఏమిటో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు చూపిస్తారన్నారు.